రవితేజ నాలో కాన్ఫిడెన్స్‌‌ పెంచారు

రవితేజ నాలో కాన్ఫిడెన్స్‌‌ పెంచారు

విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. చెల్లా అయ్యావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విష్ణు విశాల్ ఇలా ముచ్చటించాడు. ‘భార్యా భర్తల ప్రేమ కథ ఇది. కుస్తీ ఇందులో ఒక భాగం. భార్య పాత్రది కేరళ. అక్కడ మట్టికుస్తీ అనే ఆట వుంది. అందుకే ఈ టైటిల్. పెళ్లి తర్వాత భార్యభర్తలకు కొన్ని అంచనాలు వుంటాయి. వాటిని అందుకోలేనప్పుడు ఇగోలు మొదలవుతాయి. ఆ ఇద్దరి ఇగో చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఓ మెసేజ్ కూడా ఉన్నప్పటికీ వినోదాత్మకంగా చెప్పాం. మహిళా ప్రేక్షకులు ‘మట్టికుస్తీ’ని బాగా ఇష్టపడతారు. నా కెరీర్‌‌‌‌లో మొదటి ఔట్ అండ్ ఔట్ మాస్ కమర్షియల్ సినిమా ఇది. కబడ్డీ ప్లేయర్‌‌‌‌ అయిన నేను..  కుస్తీ ఆటకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది సర్‌‌‌‌ప్రైజింగ్‌‌గా ఉంటుంది. ‘ఎఫ్‌‌ఐఆర్’ సినిమాతో రవితేజ గారితో జర్నీ మొదలైంది. ఈ లైన్ చెప్పగానే తానూ ప్రొడ్యూస్ చేస్తానన్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకం నాకు కాన్ఫిడెన్స్‌‌ను పెంచింది. ఇక నా భార్య గుత్తా జ్వాలకు నటనపై ఆసక్తి లేదు. గతంలో ఓ పాట చేసినందుకు ఇప్పటికీ రిగ్రేట్‌‌ ఫీలవుతోంది. నా నిర్మాణంలో మరో మూడు సినిమాలున్నాయి. రజనీకాంత్ గారితో ‘లాల్‌‌సలాం’లో నటిస్తున్నా.క్రికెటర్, సూపర్ హీరో పాత్రలు చేయాలని ఉంది’’.