వయలెన్స్‌‌‌‌కి విజిటింగ్ కార్డ్

వయలెన్స్‌‌‌‌కి విజిటింగ్ కార్డ్

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ తెరకెక్కబోతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శనివారం బాలకృష్ణ బర్త్‌‌‌‌ డే సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. స్క్రిప్ట్‌‌‌‌ను దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా టీమ్‌‌‌‌కు అందజేశారు. చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్‌‌‌‌కి క్లాప్ కొట్టారు. గోపీచంద్ మలినేని కెమెరా స్విచాన్ చేయగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో.. ఓ పెద్ద ఇనుప పెట్టె, అందులో మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్, గొడ్డలి, ఇతర ఆయుధాలతో పాటు పాత కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ‘ప్రపంచానికి అతను తెలుసు.. 

కానీ అతని ప్రపంచం ఎవరికీ తెలియదు’ అనే క్యాప్షన్‌‌‌‌ను బట్టి ఇది పీరియాడిక్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగే సినిమా అని అర్థమవుతోంది. ‘వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అనే ట్యాగ్‌‌‌‌తో ఇదొక పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ యాక్షన్‌‌‌‌ మూవీ అని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేస్తామని చెప్పారు. మరోవైపు బాలకృష్ణ హీరోగా అనిల్‌‌‌‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. రాజు అహంకారానికి, మొండివాడికి మధ్య గల తేడాను వివరిస్తూ మొదలైన టీజర్.. ఆయన క్రికెట్‌‌‌‌ బ్యాట్‌‌‌‌ పట్టుకుని గిటార్‌‌‌‌‌‌‌‌లా వాయిస్తున్న విజువల్స్‌‌‌‌తో ఎండ్ అయింది. ఇందులో ‘అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి’ (ఎన్‌‌‌‌.బి.కె) అని తనను తాను పరిచయం చేసుకున్న బాలకృష్ణ.. ‘ఈ పేరు శానా యేండ్లు యాదుంట‌‌‌‌ది’ అని తెలంగాణ యాసలో డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంది.