వైన్స్ ముందు మద్యం తాగుతున్న యువతి.. మా రూంలో తాగుదాం అని తీసుకెళ్లి.. వంట మాస్టర్ అత్యాచారం !

వైన్స్ ముందు మద్యం తాగుతున్న యువతి.. మా రూంలో తాగుదాం అని తీసుకెళ్లి.. వంట మాస్టర్ అత్యాచారం !

ఎంత హైదరాబాద్ అయినప్పటికీ.. రాత్రి కూడా పగటి పూటలా వెహికిల్స్ తిరుగుతున్నప్పటికీ.. వీధిలైట్లు.. అద్దాల మేడల వెలుతురు ఎంత ఉన్నప్పటికీ.. మహిళలు రాత్రి రోడ్లపై.. వైన్స్ ముందు తాగటం ఎంత వరకు సేఫ్. ఒకవేళ తాగే అలవాటు ఉంటే రూం కు వెళ్లి.. లేదా ఇంటి కెళ్లి తాగొచ్చు కదా..? ఇక్కడ మహిళల స్వేచ్ఛను ప్రశ్నించడం లేదు.. కానీ వారి భద్రత గురించే ఆందోళన. ఎందుకంటే హైదరాబాద్ లో జరిగిన ఘటన స్వీయ భద్రతపై మహిళలు ఏ మేరకు ఆలోచించాలి అనే ప్రశ్న ఉత్పన్నమయ్యేలా చేస్తోంది. 

వైన్స్ ముందు తాగుతున్న యువతిని ఇక్కడ తాగటం సేఫ్ కాదు.. మా రూంలో తాగుదురు.. రండి అని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. ఎంతో సంచలనం రేపుతోంది. 

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి ఓ యువతి (22) గచ్చిబౌలిలోని ఓ వైన్ షాప్ దగ్గర మద్యం సేవిస్తోంది. అక్కడే మందు తాగుతున్న వంట మాస్టర్ సత్యప్రకాశ్ (30) అనే వ్యక్తి.. వైన్స్ షాపు దగ్గర మందు తాగడం మంచిది కాదు.. మా రూం కు వచ్చి తాగండని చెప్పి తీసుకెళ్లాడు. అంజయ్య నగర్ రూం కు తీసుకెళ్లిన వ్యక్తి.. ఆమెతో బాగా మందు తాగించాడు. తాగేందుకు ఫుల్ గా ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాతే జరగరానిది జరిగింది. 

మద్యం తాగి మత్తులోకి వెళ్లిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు వంట మాస్టర్ సత్య ప్రకాశ్. అప్పటితో ఆగకుండా ఆ యువతి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీశాడు. అర్థరాత్రి మెళకువ వచ్చాక చూసుకుంటే అమ్మాయి సెమీ న్యూడ్ గా ఉంది. ఏంటి నా సగం డ్రెస్సు.. ఎవరు తీశారు అని.. ఏం చేశావని ప్రశ్నించి.. చివరికి తాను అత్యాచారానికి గురైనట్లు గుర్తించింది. 

►ALSO READ | ఈ అమ్మాయి ఎంతకు తెగించింది : పెళ్లి చేసుకోవటం లేదని.. అబ్బాయి పేరుతో 11 రాష్ట్రాలకు బెదిరింపులు..!

‘‘నువ్వు మత్తులో ఉన్నావు.. న్యూడ్ గా ఫోటోలు, వీడియోలు కూడా తీశా.. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తా.. మొత్తం ఫార్వార్డ్ చేస్తా..’’ అని బెదిరించాడు. అసహాయ స్థితిలో చేసేదేమీ లేక వెనుదిరింగి ఆ యువతి. ఆ రాత్రికి రాత్రే.. మిడ్ నైట్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

బుధవారం నిందితుడు వంట మాస్టర్ సత్య ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనితో పాటు యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారానికి పాల్పడిన సత్యప్రకాశ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రాయదుర్గం సీఐ వెంకన్న తెలిపారు. వంట మాస్టర్ సత్య ప్రకాశ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతిగా సీఐ తెలిపారు.