మెదక్ టౌన్, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ రూరల్ ఎస్సై లింగం, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తుపాకుల నవీన్(35) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నాడు. ఈక్రమంలో వారం రోజుల కింద అన్నదమ్ములు వేరుపడగా ఇద్దరికీ కలిపి రూ.8 లక్షల వరకు అప్పులు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ గ్రామ సమీపంలోని మల్కాపూర్ తండాలోని ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
