కరెన్సీ ప్రింట్​ చేయం

కరెన్సీ ప్రింట్​ చేయం
  • పార్లమెంట్​లో నిర్మలా సీతారామన్​

న్యూఢిల్లీ: కొవిడ్​ 19 క్రైసిస్​ నుంచి గట్టెక్కడానికి కరెన్సీ ప్రింట్​ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ సోమవారం పార్లమెంట్​లో వెల్లడించారు. ఎకానమీని కాపాడేందుకు, ఉపాధి కల్పనకూ సాయపడేలా మరిన్ని కరెన్సీ నోట్లను ప్రింట్​ చేయాలని చాలా మంది ఎకానమిస్టులు, ఎక్స్​పర్ట్స్​ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్​తో 2020–21లో జీడీపీ 7.3 శాతం మేర తగ్గిపోయిందని, ఎకానమీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చాలా చర్యలను తీసుకుందని ఫైనాన్స్​ మినిస్టర్​ చెప్పారు. మన ఎకానమీ ఫండమెంటల్స్​ స్ట్రాంగ్​గా ఉన్నాయని, ఆత్మనిర్భర్​ భారత్​ మిషన్​తో ఎకానమీ గాడిలో పడుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్​ భారత్​ కింద రూ. 29.87 లక్షల కోట్ల ప్యాకేజ్​ను తెచ్చామని గుర్తుచేశారు.