
బ్యాంకుల ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చార్జీలు పెంచబోవని స్పష్టం చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు పీఎస్‌బీఎస్ సర్వీస్ చార్జీలను పెంచాయంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ..,కరోనా ప్రతికూల సమయంలో ప్రభుత్వ బ్యాంకులు సర్వీస్ చార్జీలను పెంచబోవని ఆర్థిక శాఖ భరోసా ఇచ్చింది.
కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 60.04 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండబోదని తెలిపింది. జన్‌ధన్ ఖాతాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్, విత్‌డ్రాయెల్స్‌పై నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చార్జీలు నవంబర్ ఒకటి నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.