చిన్నారులకు రూ.20 వేల ఆర్థికసాయం

చిన్నారులకు రూ.20 వేల ఆర్థికసాయం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణం రెండో జోన్​లో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్(ఆక్ట్) నిర్వాహకులు ఆదివారం రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆరు నెలల కింద పిట్టల శ్యాం అనే వ్యక్తి సెంట్రింగ్​ పనిచేస్తూ భవనంపై నుంచి పడి చనిపోయాడు. అతడి భార్య భూమక్క అనారోగ్యంతో గురువారం మృతిచెందింది. దీంతో వారి పిల్లలు హృతిక్, కార్తీక్​అనాథలయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిని ట్రస్ట్​అండగా నిలిచింది. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు బి.లక్ష్మణ్, ట్రెజరర్​ టి.సురేశ్, ప్రచార కార్యదర్శులు శరత్​బాబు,  మహేందర్, సంపత్, వెంకటేశ్, అశోక్, జనార్ధన్​ పాల్గొన్నారు.