కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్గేట్వద్ద సోమవారం లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మందమర్రి మండలం వెంకటాపూర్, పోన్నారం, గుడిపెల్లి, కాసీపేట మండలం ధర్మారావుపేట గ్రామాలకు చెందిన ఐదుగురు మహిళలు మృతిచెందగా రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మంగళవారం రాత్రి కాంగ్రెస్లీడర్లు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మృతిచెందిన చింతకుంట లక్ష్మి, అగ్గు సౌందర్య, సోనీ, తొగరి సుమలత, రాంటెంకి దివ్యవాణి కుటుంబాలకు మంత్రి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయాన్ని లీడర్లు అందజేశారు. మంత్రి వివేక్‌వెంకటస్వామి అండగా ఉంటారని బాధిత కుటుంబాలకు డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ జనరల్సెక్రటరీ పుల్లూరి లక్ష్మణ్, పార్టీ మందమర్రి మండల, టౌన్ ప్రెసిడెంట్లు కడారి జీవన్‌కుమార్, తిరుమల్, కాంగ్రెస్ఎస్సీ సెల్జిల్లా చైర్మన్నర్సింగ్, స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్, సర్పంచులు, కాంగ్రెస్లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
