30 ట్రిలియన్‌‌‌‌ డాలర్ల జీడీపీకి ఫైనాన్షియల్ సెక్టార్ ముఖ్యం: వరల్డ్‌ బ్యాంక్ రిపోర్ట్‌

30 ట్రిలియన్‌‌‌‌ డాలర్ల జీడీపీకి ఫైనాన్షియల్ సెక్టార్ ముఖ్యం: వరల్డ్‌  బ్యాంక్ రిపోర్ట్‌

న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి  30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, ఫైనాన్షియల్ రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అభిప్రాయపడింది. ప్రైవేట్ క్యాపెక్స్‌‌‌‌ను ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌‌‌‌), వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్‌‌‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏపీ) ప్రకారం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వ  స్కీమ్‌‌‌‌లతో  ఇండియాలోని ప్రజలందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి వచ్చాయి.

భారత్ ఆర్థిక వ్యవస్థ 2017 తర్వాత  మరింత స్థిరంగా మారిందని, మెరుగైందని  ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏపీ రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది. కో–ఆపరేటివ్ బ్యాంకులపై నియంత్రణలు పెంచడం, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలపై సైజ్‌‌‌‌బట్టి రెగ్యులేషన్స్‌‌‌‌, క్రెడిట్ రిస్క్ మేనేజ్‌‌‌‌మెంట్ మెరుగుదల వంటి చర్యలతో వీటిని మరింత సమర్థవంతంగా  పర్యవేక్షించడానికి వీలుంటుందని తెలిపింది. ఇన్వెస్టర్ బేస్ విస్తరించడం, బలమైన మార్కెట్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సపోర్ట్‌‌‌‌గా ఉన్నాయి.