ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్​-ఐడియాకు ఫైన్ పడాల్సిందే

ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్​-ఐడియాకు ఫైన్ పడాల్సిందే

రిలయన్స్ జియో ఇంటర్‌‌ కనెక్సన్‌‌ పాయింట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టినందుకు ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా కంపెనీలకు రూ.3,050 కోట్ల జరిమానా విధించడాన్ని డిజిటల్‌‌ కమ్యూనికేషన్స్‌‌ కమిషన్‌‌ (డీసీసీ) సమర్థించింది. అయితే ప్రస్తుతం టెలికం రంగం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంత భారీ జరిమానా విధింపుపై ట్రాయ్‌‌ అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. జియో కూడా వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో విఫలమైనందున, దానికీ జరిమానా వేయాలన్న సెక్రటరీల సూచనను తిరస్కరించింది. రిలయన్స్ జియో ఇంటర్‌‌ కనెక్సన్‌‌ పాయింట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టినందుకు ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా కంపెనీలకు ట్రాయ్‌‌ 2016 అక్టోబరులో రూ.3,050 కోట్ల జరిమానా విధించింది. తమ నెట్‌‌వర్క్‌‌లో 75 శాతం కాల్స్‌‌ విఫలమవుతున్నాయని పేర్కొంటూ జియో ఫిర్యాదు చేసింది.