
దక్షిణ మధ్య రైల్వే అధికారులు మాస్కు నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణాలు, ఎట్రెన్స్ లు , ప్లాట్‌ఫారాలపై రైల్వే భద్రత దళం సిబ్బంది మాస్కులేని వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతోంది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల్లో పలు రైల్వే స్టేషన్లలో మాస్కులు ధరించని 120 మందిని గుర్తించి.. వారికి రూ. 200 చొప్పున జరిమానాలు విధించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్లలో ప్రత్యేక నిఘాను పెంచింది రైల్వే శాఖ.