స్విస్‌ ఖాతాల వివరాలను ఇచ్చేది లేదు

స్విస్‌ ఖాతాల వివరాలను ఇచ్చేది లేదు

బ్లాక్ మనీ దాచుకున్న స్విస్‌ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వలేమని స్పష్టం చేసింది ఆర్థికశాఖ. అంతేకాదు ఇతర దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. స్విట్జర్లాండ్‌తో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలోనే వివరాలను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. పన్ను సంబంధిత వివరాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వివరాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్(RTI)లో 8(1)A, 8(1)(F) కింద మినహాయింపు ఉందని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. భారత్‌ సహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందులో ఎక్కువగా మూసివేసిన ఖాతాదారుల సమాచారమే ఉందని తెలిసింది.