నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

మన్నెగూడలో యువతి కిడ్నాప్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. యువతి తండ్ర దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు దామోదర్ రెడ్డి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. షటిల్ బ్యాడ్మింటన్ వద్ద తన కూతురుతో నవీన్ రెడ్డి పరిచయం పెంచుకున్నాడని, అప్పటి నుంచి ప్రేమ,పెళ్లి పేరుతో వేధిస్తున్నాడని అందులో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నవీన్ రెడ్డి, రూబెన్ అనే వ్యక్తితో పాటు మరో 50 మంది అనుచరులతో వోల్వో కార్ ts07hx 2111, బొలెరో కార్ ts 07u4141 తో పాటు మరి కొన్ని కార్లలో వచ్చి తమపై దాడికి పాల్పడి తన కూతురిని కిడ్నాప్ చేశాడని చెప్పారు. 

ఐరన్ రాడ్లు, రాళ్లతో ఇంటికి వచ్చిన నవీన్ రెడ్డి తలపై ఐరన్ రాడ్ తో దాడి చేశాడని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన స్నేహితులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దాడి అనంతరం తన కూతుర్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని పోయారని, ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడని అన్నారు. ఇంటి వద్ద పార్క్ చేసిన కార్లను సైతం ధ్వంసం చేసినట్లు కంప్లైంట్ కాపీలో రాశారు.

దామెదర్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పై ఐపీసీ సెక్షన్ 147,148,307,324,363,427,506,452,380r/w 149 కింద కేసు ఫైల్ చేశారు.