ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌ల బ్లాక్ టికెట్ల దందా.. బీసీసీపై కేసు నమోదు!

ODI World Cup 2023: వరల్డ్ కప్ మ్యాచ్‌ల బ్లాక్ టికెట్ల దందా.. బీసీసీపై కేసు నమోదు!

ఆదివారం(నవంబర్ 5) ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కొన్ని గంటల క్రితం ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఒక వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పలు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. టికెట్‌ అసలు ధర రూ. 2500కాగా, అతను ఒక్కో టికెట్‌ను రూ. 11,000 చొప్పున విక్రయించేందుకు అతను ప్రయత్నించినట్లు పోలీసులవిచారణలో వెల్లడైంది. చివరకు ఈ ఘటన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మెడకు చుట్టుకుంది. బీసీసీఐయే ఈ దందాను నడిపిస్తోందని ఓ అభిమాని పోలీసులు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ఇండియా- సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీసీసీఐ, క్యాబ్(బెంగాల్ క్రికెట్ అసోసియేషన్), బుక్‌మైషోపై ఓ అభిమాని కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభిమానులకు దక్కాల్సిన టికెట్లను క్యాబ్, బుక్‌మైషో అధికారులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని సదరు అభిమాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ  ఫిర్యాదు ఆధారంగా కోల్‌కతా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బుక్‌మైషో, క్యాబ్ అధికారులకు నోటీసులు పంపిన పోలీసులు.. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై బీసీసీఐ, బుక్‌మైషో, క్యాబ్ నోరు మెదపడం లేదు.

ఇదిలావుంటే, వరల్డ్ కప్ ప్రారంభమైననాటి నుంచి ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. కొందరైతే ఏకంగా సోషల్ మీడియా వేదికనే తమ అడ్డాగా మార్చుకున్నారు. కాగా, ధర్మశాల వేదికగా జరిగిన ఇండియా -న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్లను విక్రయిసస్తున్న హైదరాబాద్ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ALSO READ : ODI World Cup 2023: ఆస్ట్రేలియాకు బ్యాడ్ న్యూస్.. స్వదేశానికి వెళ్లిపోయిన మిచెల్ మార్ష్