జర్నలిస్ట్ మూర్తిపై కేసు.. నటుడు సత్య సాయి మహేశ్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ రిజస్టర్

 జర్నలిస్ట్ మూర్తిపై కేసు.. నటుడు సత్య సాయి మహేశ్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ రిజస్టర్

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్ మూర్తిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయ్యింది. మాజీ మంత్రి కాకాని వెంకటేశ్వరరావు కొడుకు, నటుడు కాకాని ధర్మ సత్య సాయి మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. బ్లాక్ మెయిల్ ఆరోపణలపై నమోదైన ఈ కేసులో.. ఏ1గా ధర్మ మహేశ్ భార్య గౌతమి చౌదరిని, ఏ2గా మూర్తిని చేర్చారు. ధర్మ సత్య సాయి మహేశ్, అతని భార్య గౌతమి చౌదరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో మూర్తితో కలిసి గౌతమి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సత్య సాయి మహేశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మూర్తి తన -ఫోన్ ట్యాప్​ చేశాడని సత్య సాయి మహేశ్ కూడా పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. స్పై కెమెరాల ద్వారా తీసిన వీడియోలు తీసి.. రూ.10 కోట్లు ఇచ్చి వివాదం సెటిల్ చేసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తునట్లు వెల్లడించారు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గౌతమి చౌదరిని, మూర్తిపై కేసు నమోదు చేశారు.