టీస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో సిట్ విచారణపై దూకుడు పెంచింది. నిందితులను విచారిస్తున్న సిట్.. కీలక ఆధారాలు సేకరిస్తుంది. పేపర్ లీక్ ఘటనలో మరో ముగ్గురు టీఎస్పీఎస్సీ ఉద్యోగుల హస్తం ఉన్నట్లు సిట్ గుర్తించింది. వాళ్లు కూడా పేపర్ లీక్ లో భాగస్వామ్యం అయ్యారని గుర్తించిన సిట్.. వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం వాళ్లకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిట్ అధికారులు తెలిపారు. అయితే, వాళ్ల వివరాలేవీ తెలియరాలేదు. ఈ ముగ్గురే కాకుండా టీఎస్పీఎస్సీలో పని చేస్తున్న మరో 30 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ర్యాంకు సాధించిన వాళ్లలో నిందితుడు రాజశేఖర్ సన్నిహితుడు ఉన్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
