15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుల ఆవేదన

15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుల ఆవేదన

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొలంలో మంటలు చెలరేగి పంట అంతా కాలిపోయింది. ఈ ఘటన ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే..అబ్బాపూర్ గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల్లో విద్యుత్ ఘాతంతో మంటలు అంటుకున్నాయి. దీంతో15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది.

పంట నష్టంతో పాటు.. వ్యవసాయ సామాగ్రి కాలి బూడిదైయ్యాయి. మంటలు చూసిన రైతులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అయితే పొలాల్లోకి మంటలార్పెందుకు రామంటూ వెనుతిరిగారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా వారి శమ వృదా అయింది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.