హైదరాబాద్ సిటీ శివార్లలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2026, మే 19వ తేదీ మధ్యాహ్నం.. భగభగ మండే ఎండ కాస్తున్న సమయంలో.. సాల్వెంట్ అనే కెమికల్ కంపెనీకి చెందిన గోదాంలో మంటలు వచ్చాయి. క్షణాల్లోనే గోదాం నుంచి నల్లటి పొగ మేడ్చల్ ప్రాంతాన్ని కమ్మేసింది.
ప్రమాదం జరిగిన వెంటనే.. పోలీసులు, ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కెమికల్ గోదాం కావటంతో మంటలు చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు అగ్ని మాపక సిబ్బంది. ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా.. ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయాలు వెల్లడికాలేదు.
కెమికల్ గోదాంలో మంటలకు కారణం ఏంటీ అనేది ఇంకా ప్రకటించలేదు అధికారులు. మంటలను అదుపు చేసిన తర్వాత.. సిబ్బంది నుంచి వివరాలు సేకరించి చెబుతాం అంటున్నారు అధికారులు.
