
ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు, ఒకరి ఆచూకి తెలవడంలేదని పోలీసులు తెలిపారు. ముంబైలోని సబర్బన్ ఘట్కోపర్ లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ గోడాన్ లో మంటలు అంటుకున్నాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తొమ్మిది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పాయి. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు ప్రాణనష్టం జరగలేదని చెప్పారు పోలీసులు. అయితే ఈ రోజు పొద్దున ఇద్దరు మృతి చెందారని ఒకరి ఆచూకి దొరకడంలేదని అప్డేట్ ఇచ్చారు.
Maharashtra: Cooling operations underway at the factory in Ghatkopar, Mumbai where fire broke out last night. Two people have died in the incident and one person is missing pic.twitter.com/xVhDzRN7Ua
— ANI (@ANI) December 28, 2019