
కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేపీహెచ్ బీలోని ఓ ఎలక్ట్రికల్ షాప్ లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపులో ఎలక్ట్రికల్ వస్తువులు ఉండటంతో మంటలు పై అంతస్థులోకి వ్యాప్తించాయి. దాదాపు 3 గంటలుగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నా అదుపులోకి రావడం లేదు. షాట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.