రైల్లో సిలిండర్ పేలి 8 మంది మృతి

రైల్లో సిలిండర్ పేలి 8 మంది మృతి

మధురై రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మృతి చెందారు.  మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  రైలులో మొత్తం 60 మందికి పైగా గాయపడ్డారు.

క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.  మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  2023 ఆగస్టు 26 న తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.  

రైలులోని కిచెన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను ఉత్తర ప్రదేశ్ వాసులుగా గుర్తించారు.  

రామేశ్వరం నుంచి కన్యాకుమారి వైపు వెళ్తుంది రైలు.  ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. IRCTC నడుపుతున్న టూరిస్ట్ రైలులో ప్రయాణికులు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, దీంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని చెబుతున్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులకు దక్షిణ రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.