ముంబై టెలిఫోన్​భవన్​లో మంటలు..ఉద్యోగులంతా సేఫ్

ముంబై టెలిఫోన్​భవన్​లో మంటలు..ఉద్యోగులంతా సేఫ్

ఉద్యోగులంతా సేఫ్.. ఎండీ శ్రీవాత్సవ

ముంబైలోని టెలిఫోన్​భవన్​లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొమ్మిది అంతస్థుల బిల్డింగ్​లో మూడు, నాలుగు ఫ్లోర్లలో మంటలు రేగాయి. రెస్క్యూ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదు. మంటల్లో చిక్కుకుపోయిన 84 మంది మహానగర్​టెలిఫోన్​నిగమ్​లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) ఉద్యోగులను వారు క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఈమేరకు ఎంటీఎన్ఎల్​ఈడీ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మంటలు వేగంగా వ్యాపించాయని, దట్టంగా వెలువడిన పొగతో ఉద్యోగులు భయాందోళనకు లోనయ్యారని చెప్పారు. వారిని కాపాడేందుకు భారీ క్రేన్లను ఉపయోగించారని, సాయంత్రం 6 గంటల వరకు అందరూ బయటకు వచ్చేశారని శ్రీవాత్సవ చెప్పారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదని, అగ్ని ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ఆయన వివరించారు.