
పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమైన పాశమైలారంలోని నిర్మల కెమికల్ (సాల్వెంట్స్ ) కంపెనీలో ఈ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని కెమికల్ డంప్ లో మంటలు చెలరేగటంతో నిర్మల కెమికల్ సాల్వెంట్ కంపెనీతో పాటు దగ్గర్లోని మరో రెండు పేపర్ కంపెనీలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. చుట్టు పక్కల ప్రాంతాలలో కూడా మంటలు వ్యాపించడంతో పోలీసులు, పైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మొత్తం మూడు కంపెనీల్లో చెలరేగిన మంటల్లో.. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని సంగారెడ్డి లోని హాస్పిటళ్లకు తీసుకెళ్లారు.