ఎలక్ట్రిక్ కారులో మంటలు.. హెడ్ ల్యాంప్ కారణం

ఎలక్ట్రిక్ కారులో మంటలు.. హెడ్ ల్యాంప్ కారణం

ఎండ తీవ్రతకు ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు పేలిపోతుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను ప్రజలు ఎదురుకుంటనే ఉన్నారు. ఎలక్ట్రానిక్ వెహికల్స్ నడిపేవాళ్లు కాస్త  అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటారు కూడా. తాజాగా కొన్ని వాహనాల బ్యాటరీలు పేలి.. కారు కాలిపోయిన ఘటనలు చూస్తుంటాం. అలాంటి ఘటన ఫుణాలో జరిగింది. 

టాటా నెక్సాన్ ఈవీ కారు బ్యాటరీ పేలి.. కారు మొత్తం కాలిపోయింది. అయితే, ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న టాటా.. దర్యాప్తు చేపట్టింది. అందులో కస్టమర్.. టాటా నెక్సాన్ ఈవీ హెడ్ ల్యాంప్ కాకుండా, నాసి రకం హెడ్ ల్యాంప్ ను వాడినట్లు తేలింది. లోకల్ మెకానిక్ దగ్గర రిపేర్ చేయించినట్లు గుర్తించారు. దానివల్లే బ్యాటరీపై వేడి పెరిగి కాలిపోయినట్లు తేల్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. మంటలను ముందుగా గుర్తించిన కారు యజమాని.. కారుకు దూరంగా వచ్చేశాడు.

కస్టమర్లు ఈవీ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లోనే కార్ సర్వీస్ చేయాలని టాటా కంపెనీ కోరింది. లేదంటే ఇంలాంటి ఘటనలు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది.