
ఢిల్లీ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ( శుక్రవారం) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. లోధి రోడ్ ప్రాంతంలోని సీజీఐ కాంప్లెక్స్‌లో CBI భవనంలోని బేస్మెంట్లో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. మంటలు రావడంతో కార్యాలయంలోని ఉద్యోగులంతా బయటికి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది..ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.