
ఢిల్లీలోని వికాస్ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెస్తున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ వికాస్ భవన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం..మంటలు ఆర్పుతున్నారు.
మరోవైపు రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో చుట్టు ప్రక్కల అనేక కార్యాలయాలు మూసేశారు. దీంతో ప్రమాదం తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.