ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రెస్క్యూ చేస్తుండగా పేలుడు.. బిల్డింగ్ కూలి ఫైర్ సిబ్బంది కూడా..

ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. రెస్క్యూ చేస్తుండగా పేలుడు.. బిల్డింగ్ కూలి ఫైర్ సిబ్బంది కూడా..

ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చి అందులో చిక్కుకున్న వారిని రక్షిస్తుండగా మరోసారి పేలుడు సంభవించడంతో బిల్డింగ్ కుప్పకూలింది. దాని కింద ఫైర్ సిబ్బంది సహా పలువురు ఫ్యాక్టరీ వర్కర్లు చిక్కుకున్నారు.

పశ్చిమ ఢిల్లీ పీరాగఢీ ప్రాంతంలోని ఉద్యోగ నగర్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో తెల్లవారు జామున 4.23 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఏడు ఫైరింజన్లను అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. లోపల ఉండిపోయిన వాళ్లను రక్షించేందుకు ఫైర్ సిబ్బంది బిల్డింగ్‌లోకి వెళ్లారు. రెస్క్యూ  చేస్తుండగా.. మళ్లీ పేలుడు జరగడంతో బిల్డింగ్ కూలి.. ఫైర్ సిబ్బంది, ఫ్యాక్టరీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో 35 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ఘటనలో 14 మంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. వారిలో ఒకరు మరణించగా.. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు నుంచి వెళ్తున్న కొందరు బిల్డింగ్ కూలి ఆకాశానికి ఎగుస్తున్న పొగ, దుమ్మును వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు.