అమృత్‌‌సర్‌‌ గురునానక్ దేవ్ హాస్పిటల్‌‌లో భారీ అగ్నిప్రమాదం

అమృత్‌‌సర్‌‌ గురునానక్ దేవ్ హాస్పిటల్‌‌లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన ఇంకా మరిచిపోకముందే. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం ఒక్కసారిగా మంటలు భారీగా చెలరేగాయి. అందులో ఉన్న పేషెంట్లను తరలించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేశారు. కానీ ఆసుపత్రి మొత్తం భారీగా పొగ కమ్ముకోవడంతో వారి ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యాయి.

రోగుల ఆర్తనాదాలతో ఆసుపత్రి మారుమ్రోగింది. ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేయడానికి గంట సమయం పట్టింది. ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Nephrologyకి సంబంధించిన ఆరు వార్డులు, రెండు చర్మానికి సంబంధించిన వార్డులు, ఆరు సర్జికల్ వార్డులను ఖాళీ చేసి అందులో ఉన్న రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం సంభవించిందా ? అనేది తెలియరాలేదు. 

మరిన్ని వార్తల కోసం : 

శ్రీలంక మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం

గౌహతిలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం