ఢిల్లీ: మహారాణి బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ: మహారాణి బాగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీ మహారాణి బాగ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి మహారాణీ బాగ్ లోని ఓ షాప్ లో తీవ్రమైన అగ్నిప్రమాదం జరుగగా స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పారు. అయితే అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రాణనష్టం జరుగలేదని, ఆస్తినష్టమే జరిగిందని చెప్పారు. పూర్తివివరాలు తెలియాల్సివుంది.