ఢిల్లీలో అగ్ని ప్రమాదం..

ఢిల్లీలో అగ్ని ప్రమాదం..

ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ పేలి ఓ షూ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రియల్ ఏరియా లో ఉన్న ఒక షూ ఫ్యాక్టరీలో మంగళవారం పొద్దున గ్యాస్ సిలిండర్ పేలి మంటలు అంటుకున్నాయి. ఫ్యాక్టరీ మూడంతుల భవనంలో ఉండగా పై అంతస్థులో గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అక్కడ దట్టమైన పొగ వ్యాపించింది.  ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం ప్రాణనష్టం జరుగలేదని పోలీసులు చెప్పారు.