భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో బస్టాండ్ దగ్ధం

భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో బస్టాండ్ దగ్ధం

జమ్మూకాశ్మీర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నార్త్ కాశ్మీర్ లో కుప్వార జిల్లాలోని దార్ గిల్ బస్టాండ్ ప్రాంతంలో జనవరి 4వ తేదీ గురువారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రమంగా మంటలు చెలరేగి బస్ స్టాండ్ మొత్తం అంటుకున్నాయి. సమీపంలో ఉన్న దాదాపు 15 దుకాణాలు, ఒక ఇల్లుకు మంటలు వ్యాపించాయి. దీంతో బస్టాండ్ తోపాటు షాపులు, ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.