భారీ అగ్నిప్రమాదం..మంటలార్పుతున్న 24 ఫైరింజన్లు

భారీ అగ్నిప్రమాదం..మంటలార్పుతున్న 24 ఫైరింజన్లు

ఢిల్లీ ఉద్యోగ్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉద్యోగ్ నగర్ లోని షూ తయారీ కంపెనీలో ఉదయం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆరుగురు ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 24 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నాయి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రెండు అంబులెన్సులు కూడా స్పాట్ కు చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.