కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి, 48మందికి గాయాలు

 కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురు మృతి, 48మందికి గాయాలు

మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మే 23వ తేదీ గురువారం థానే జిల్లాలోని  డోంబివ్లిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఎంఐడీసీ ఫేజ్ 2లోని కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా..  దాదాపు 48మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరో 30మందిని రక్షించినట్లు చెప్పారు. మరికొంతమంది ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేప్టటారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.   ఫ్యాక్టరీలో మొత్తం మూడుసార్లు పేలుళ్లు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.