అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

అహ్మదాబాద్- చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్ లో చెలరేగిన మంటలు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో ట్రైన్ లోప్రమాదం జరిగింది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైన్ లోని కిచెన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం అవడంతో ప్రమాదం తప్పింది. గూడూరు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ను ఆపేసి మంటలను అదుపు చేశారు. దాదాపు గంట సేపు  ట్రైన్ గూడూరు స్టేషన్ లో నిలిచిపోయింది. 

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. తెల్లవారుజామున 2.45 నిమిషాలకు రైలు గూడురు వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగినట్టు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికార ప్రతినిధి నుస్రత్ ఎం మంద్రుప్‌కర్ తెలిపారు. కిటికీల ద్వారా పొగ బయటికి రావడంతో ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని, ఆ తర్నాత సప్లై ఆపేసి మంటలను అదుపులోకి తెచ్చామని స్పష్టం చేశారు.