ప్లైవుడ్ గోడౌన్‌‌లో అగ్ని ప్రమాదం

ప్లైవుడ్ గోడౌన్‌‌లో అగ్ని ప్రమాదం

శంషాబాద్, వెలుగు: మైలార్‌‌దేవ్‌‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లైవుడ్​గోడౌన్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సలీం ప్లైవుడ్​గోడౌన్​లో ఆదివారం షార్ట్​సర్క్యూట్​కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు పోలీసులకు, ఫైర్​సిబ్బందికి సమాచారం అందించారు.

 వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.15 లక్షల  విలువైన సామగ్రి కాలిబూడిదైనట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.