హసన్ నగర్లోని బట్టల గోదాంలో అగ్నిప్రమాదం

 హసన్ నగర్లోని బట్టల గోదాంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ అత్తాపూర్ హసన్ నగర్ లోనూ  భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో  దట్టమైన పొగ వ్యాప్తితో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది... రెండు ఫ్లోర్లలో వ్యాపించిన మంటలను  ఆర్పుతున్నారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారుల చర్యలు చేపట్టారు. సమీప ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు.  ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం సంభించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.