సింగరేణి ఓపెన్ కాస్ట్లో గ్యాస్ లీక్

సింగరేణి ఓపెన్ కాస్ట్లో గ్యాస్ లీక్

పెద్దపల్లి జిల్లా:  గోదావరిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ 5వ ప్రాజెక్టులో భారీ మొత్తంలో గ్యాస్ లీకవుతోంది. దీంతో పెద్దమొత్తంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. గ్యాస్ వెలువడుతున్న ప్రాంతంలో మట్టినిపోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. గతంలో ఇదే ప్రాంతంలో జీడీకే5, 5ఏ (GDK-5, 5A) అండర్ గ్రౌండ్ మైన్స్ నడిచినట్లు తెలుస్తోంది.సహజంగానే భూగర్భంలో గ్యాస్ వెలువడి బొగ్గు మండుతోందని అధికారులు ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దించారు.