తప్పిన ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు

తప్పిన ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ లో ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్​ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. సుచిత్ర ప్రధాన రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ పక్కన ఆపేశాడు. ఆ తర్వాత కాసేపటికి ఇంజన్ లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకొని మంటలను అదుపు చేశారు. 

Also Read :- కానిస్టేబుల్ను ఢీకొట్టిన కారు

ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇంజన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగాయని స్థానికులు అనుమానిస్తున్నారు.