దక్షిణ ఎక్స్ ప్రెస్  రైలులో ప్రమాదం!

దక్షిణ ఎక్స్ ప్రెస్  రైలులో ప్రమాదం!

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. రైలు చివరి బోగీలో మంటలు వ్యాపించాయి. దీనిని గుర్తించిన సిబ్బంది రైలును ఆపివేశారు. భువనగిరి దగ్గరిలోని పగిడిపల్లి మధ్య శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను గమనించిన సిబ్బంది రైలు డ్రైవర్ ను అలర్ట్ చేశారు. దీంతో రైలును ఆపివేశారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఈ విషయం తెలుసుకుని భయాందోళనలకు గురయ్యారు.

రైలు దిగి పరుగులు తీశారు. మంటల చెలరేగింది లగేజీ బోగీ అని రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే...ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా ? అనేది తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న సికింద్రాబాద్ రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా ? అనేది తెలియరావడం లేదు. సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.