Fire accident : విక్టిమ్ లొకేషన్ కెమెరాతో ముగ్గురి కోసం గాలింపు

Fire accident : విక్టిమ్ లొకేషన్ కెమెరాతో ముగ్గురి కోసం గాలింపు

డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్ అగ్ని ప్రమాదం ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వారి ఆనవాళ్లు గుర్తించేందుకు ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది విక్టిమ్ లొకేషన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాన్ని బిల్డింగ్ లోకి పంపిన అధికారులు.. దీన్ని ఉపయోగించి శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తులను సైతం కనిపెట్టవచ్చని చెప్పారు. వీఎల్సీ సాయంతో బాధితులతో మాట్లాడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రోన్ల సాయంతో భవనం లోపలి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసినా బిల్డింగ్ లోపల అంతా చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించడం లేదు. 

ఇదిలా ఉంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగించడంపై రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఓనర్లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. బిల్డింగ్ బీమ్లు పూర్తిగా దెబ్బతిన్నారని నిట్ ప్రొఫెసర్ చెప్పారని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశారు.