మెదక్ (చేగుంట), వెలుగు: చేగుంట మండలం చిట్టోజిపల్లిలో శనివారం గుడిసె దగ్ధమై రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఎగ్గడి నర్సింలుకు చెందిన గుడిసె ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది.
కూతురు పెళ్లి కోసం దాచుకున్న రూ.5 లక్షలు, 3 తులాల బంగారం, 20 తులాల వెండి, బట్టలు, నిత్యావసర సరుకులు, పొలం తాలూకు పట్టా పాస్ పుస్తకాలు అన్నీ కాలి బూడిదయ్యాయని బాధితుడు నర్సింలు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు.
