స్కూల్ బస్సులో మంటలు..మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

స్కూల్ బస్సులో మంటలు..మైలార్ దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  ఘటన

శంషాబాద్, వెలుగు: రన్నింగ్​లో ఉన్న స్కూల్​ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మైలార్ దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​కు చెందిన బస్సు  బుధవారం సాయంత్రం స్టూడెంట్స్​ను దింపేసి మేలార్​దేవ్​పల్లి పీఎస్​ పరిధిలోని నాగర్​గుల్​ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు లేచాయి. ఫైర్​ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటన సమయంలో బస్సులో పిల్లలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.