- .మెయింటనెన్స్కోసం ఉంచిన 3 బోగీలు దగ్ధం
- షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానాలు
మల్కాజి గిరి, వెలుగు: చర్లపల్లి రైల్వే స్టేషన్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 5, 6 మధ్య మెయింటెనెన్స్ కోసం నిలిపిన ఖాళీ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చివరి బోగీలో మొదలైన మంటలు వేగంగా పక్కనున్న బోగీలకు వ్యాపించాయి. దీనివల్ల దాదాపు ఏడు బోగీలు మంటల ధాటికి ప్రభావితం కాగా, మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు స్టేషన్ పరిసరాలను కమ్మేయడంతో స్థానికులు, ఇతర ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు.
రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై కరెంట్సరఫరాను నిలిపివేశారు. మంటలు ఇతర రైళ్లకు వ్యాపించకుండా కాలిపోతున్న బోగీలను వేరు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్‌ఫైటర్స్45 నిమిషాల్లోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
