కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

కాకినాడలో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

ఏపీలోని  కాకినాడ  తాళ్ళరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఫైబర్ బోట్ల తయారీ కంపెనీలో  మంటలు చెలరేగాయి.  ఈ ఘటనలో 40 బోట్లకి పైగా దగ్ధం కావడంతో భారీగాఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో  స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి  మంటలను ఆర్పుతున్నారు. ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతుంటంతో  మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.