ప్రైవేట్ ​ట్రావెల్స్​లో మంటలు... పూర్తిగా దగ్ధమైన ఏసీ బస్సు

 ప్రైవేట్ ​ట్రావెల్స్​లో మంటలు... పూర్తిగా దగ్ధమైన ఏసీ బస్సు
  •     నాగపూర్​ నుంచి హైదరాబాద్​వస్తున్న 29 మంది  క్షేమం 
  •     షార్ట్​ సర్య్యూటే కారణం

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద మంళవారం తెల్లవారుజామున పూజా ట్రావెల్స్​కు చెందిన ఏసీ బస్సులో షార్ట్​సర్క్యూట్​తో మంటలు ఎగసిపడ్డాయి. ఈ బస్సు సోమవారం రాత్రి మహారాష్ట్ర లోని నాగ్​పూర్ లో బయలుదేరి హైదరాబాద్ వస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నాడు. 

పొగ వాసన రావడంతో గుర్తించిన కొందరు ప్రయాణికులు నిద్రపోతున్నవారందరినీ అలర్ట్​చేసి కిందకు దింపారు.  అందరూ కిందకు దిగిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. అందులోని ప్యాసింజర్ల లగేజీ కూడా పూర్తిగా కాలిపోయింది.