ఘనంగా ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్ వార్షికోత్సవం

ఘనంగా ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్ వార్షికోత్సవం

గండిపేట, వెలుగు: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని ఆదర్శ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మొదటి వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్ ఫౌండర్, చైర్మన్ జి. మదన గోపాల స్వామి చీఫ్ గెస్టుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్​ను ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే వెయ్యి మంది కస్టమర్లను కలిగి ఉండటం సంతోషంగా ఉందన్నారు. 

కస్టమర్లకు బ్యాంక్ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. గోల్డ్ లోన్, హౌస్ లోన్, బిజినెస్, ప్రాపర్టీ, లోన్ అగెనెస్ట్ డిపాజిట్స్, క్యాష్ క్రెడిట్ లిమిట్స్, సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఫెసిలిటీస్​ను కల్పిస్తున్నామన్నారు. ఆదర్శ కో ఆపరేటివ్ బ్యాంక్ సేవలను జనం వినియోగించుకోవాలని ఆయన  కోరారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఆర్. మనోహర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.