హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్ వ్యాక్సిన్

V6 Velugu Posted on May 01, 2021

రష్యాలో తయారైన స్పుత్నిక్ V కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ చేరుకుంది. ప్రత్యేక ఎయిర్ కార్గోలో లక్షా 50వేల డోసులు హైదరాబాద్ చేరుకున్నాయి. వాటిని రెడ్డీస్ ల్యాబ్‌కు అందజేయనున్నారు. స్పుత్నిక్ వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇచ్చే ముందు కొద్ది మందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రయోగాల ఫలితాల ఆధారంగా... వ్యాక్సిన్ వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ఈ నెలలో మొత్తం 30లక్షల డోసుల వ్యాక్సిన్ భారత్‌కు రానుంది.

Tagged Hyderabad, Telangana, coronavirus, Russia, Sputnik vaccine

Latest Videos

Subscribe Now

More News