జగిత్యాల జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా బారినపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న జగిత్యాలలోని కృష్ణానగర్ కు చెందిన వృద్ధుడు (75) శనివారం రాత్రి మృతి చెందాడు. ముంబాయి నుంచి వచ్చిన వలస కూలీ అయిన వృద్ధుడికి ఈ నెల 20 న కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అక్కడే మరణించాడు. అతని కూతురికి కూడా పాజిటివ్ రాగా శనివారం రాత్రి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
