కేరళలోని త్రిసూర్ జిల్లాలో.. మంకీ పాక్స్​తో తొలి మరణం

కేరళలోని త్రిసూర్ జిల్లాలో.. మంకీ పాక్స్​తో తొలి మరణం

తిరువనంతపురం: దేశంలో తొలి మంకీపాక్స్ డెత్ నమోదైంది. కేరళకు చెందిన ఓ యువకుడు (22) శనివారం మధ్యాహ్నం మంకీపాక్స్​తో చనిపోయాడు. ఇప్పటివరకు దేశంలో 4మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, మరణం సంభవించడం ఇదే తొలిసారి. అయితే, త్రిసూర్ జిల్లా, పున్నయూర్ కు చెందిన ఆ యువకుడు జులై 22న యూఏఈ నుంచి వచ్చాడని కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ వెల్లడించారు.

విదేశాల్లోనే మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిందని, కానీ కుటుంబసభ్యులు శనివారమే ఆ రిపోర్టును డాక్టర్లకు అందజేశారని తెలిపారు.  ‘‘అతనికి మంకీపాక్స్ సింప్టమ్స్ ఏమీ లేవు. కానీ మెదడువాపు, తీవ్ర ఆయాసంతో జులై 26న ఆస్పత్రిలో చేరాడు. మంకీపా  క్స్​తో మరణం సంభవించే చాన్స్​తక్కువ. డెత్ పై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం’’ అని మంత్రి చెప్పారు. శాంపిల్స్​ను అళప్పుళలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి టెస్టింగ్ కోసం పంపినట్లు చెప్పారు. యూఏఈ నుంచి వచ్చాక యాక్టివ్ గానే ఉన్నా.. చనిపోయాడని బంధువులు తెలిపారు.