భూతద్ధం భాస్కర్‌ నారాయణ... అతడో విలేజ్‌ డిటెక్టివ్‌

భూతద్ధం భాస్కర్‌ నారాయణ... అతడో విలేజ్‌ డిటెక్టివ్‌

చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శివ కందుకూరి..ఆ తర్వాత గమనం వంటి సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు రాలేదు. అయితే హిట్ ఫ్లాప్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్న శివ కందుకూరి..తాజాగా భూతద్ధం భాస్కర్ నారాయణగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.  పురుషోత్తం రాజ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజగా ఈ మూవీకి  సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను  విడుదల అయింది. ఈ సినిమాలో శివ కందుకూరికి జోడిగా రాశి సింగ్‌ నటిస్తోంది. 
 
ఒక నిమిషం 41 సెకన్ల నిడివి ఉన్న  ఫస్ట్‌ గ్లింప్స్‌  ప్రారంభంలో  శేషపాన్పుపై పవళించిన విష్ణుమూర్తి వద్దకు నారదడు, ఇంద్రుడు వచ్చి కలియుగంలో రాక్షసులు భుమిపై అవతరించబోతున్నారు. ఆ రాక్షసుల నుంచి కాపాడమంటూ  విష్ణుమూర్తిని వేడుకొంటారు.  విష్ణుమూర్తి వారికి అభయమిస్తూ..చింతించకు ఇంద్రదేవా.. కలియుగాన భూమిపై  జన్మించి ఏ ఉపద్రవం తలెత్తకుండా చూస్తానని మాట ఇస్తాడు. ఇదే సమయంలో  హీరో శివ కందుకూరి భూతద్ధం భాస్కర్‌ నారాయణగా ఎంట్రీ ఇస్తాడు. షర్టు వేసుకుని, లుంగీ కట్టుకుని, బ్లాక్ కళ్లద్దాలు పెట్టుకుని, రివాల్వర్‌ తీసుకుంటాడు. పోలీస్‌ జీపు నుంచి దిగి స్టైల్‌గా సిగరెట్‌ అంటించి అందర్నీ ఆకట్టుకుంటాడు. 

భూతద్ధం భాస్కర్‌ నారాయణ గ్లింప్స్‌ను చూస్తుంటే... మైథాలజీ నేపథ్యంలో సాగే కథలా అనిపిస్తోంది.  ఇది గ్రామీణ వాతావరణంలో జరిగే డిటెక్టివ్‌ స్టోరీ.  విలేజ్‌లో డిటెక్టివ్‌ అనే వినూత్న కాన్సెప్ట్తో డైరెక్టర్‌ వినూత్నంగా ప్రెజెంట్‌ చేసే ప్రయత్నం చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. భూతద్ధం భాస్కర్‌ నారాయణ  చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూర్చారు.  ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు  జరుగుతుండగా...ఈ మూవీకి  సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ త్వరలో విడుదల కానున్నాయి.